లాక్ డౌన్‌ను ప్రతిఒక్కరు పాటించాలి : మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
నిజామాబాద్ (చట్టం) : గత 25 రోజుల్లో విదేశాల నుంచి జిల్లాకు 2600మంది వచ్చారని వీరిని గ్రామాల వారిగా గుర్తించి వాళ్ల ద్వారా కరోనా వైరస్ ప్రభల కుండా జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. జిల్లా కలెక్టరేట్‌లోని ప్రగతి సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ఏప్రిల్ 15వరకు లాక్ డౌన్ ప్రకటించిందని ఎవరు ఇండ్ల నుండి బయటకు రావద్దని ప్రతి ఒక్కరు సామాజిక దూరం పాటించాలని కోరారు. ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ను వ్యతిరేకిస్తూ కారణం లేకుండా బయటకు వస్తే కఠిన చర్యలు తప్పవని, క్రిమినల్ కేసులు పెడతామని, పాస్ పోర్ట్ సీజ్ చేస్తామని హెచ్చరించారు. నిత్యావసర వస్తువుల విక్రయదారులు అధిక ధరలకు విక్రయించరాదని, ఒక వేళ విక్రయిస్తే కేసులు నమోదు చేస్తామని అన్నారు. 90శాతం మంది నిరుపేదలకు రేషన్ బియ్యం పంపిణి చేస్తున్నామని, వారం రోజుల్లో పంపిణీ పక్రియ పూర్తి చేస్తామన్నారు. అత్యవసర సర్వీసుల్లో పనిచేసే వారు తమ వెంట తప్పకుండా గుర్తింపు కార్డులను పెట్టుకోవాలన్నారు. అంతే కాకుండా ప్రత్యేక పాసులు కూడా జారీ చేస్తామన్నారు. జిల్లా నుంచి ఇప్పటి వరకు 16మందికి వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు.
ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి, సిపి కార్తికేయ, వైద్యాధికారులు, కమీషనర్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.


0 Comments:
Post a Comment