టిఆర్‌ఎస్ ప్రభుత్వం మైనారీటిల కల్పవృక్షం
టిఆర్‌ఎస్ ప్రభుత్వం గతంలో ఏ ప్రభుత్వాలు చేయనన్ని పథకాలు సిఎం కేసీఆర్ హయాంలో మైనారీటిలకు కల్పించింది, మైనారీటిల కల్పవృక్షంగా టిఆర్‌ఎస్ పేరొందింది అని 41వ డివిజన్ టిఆర్‌ఎస్ అభ్యర్థి చాంగుబాయి తెలిపారు.
చంద్రశేఖర్‌కాలనీలో గురువారం ముమ్మర ప్రచారం నిర్వహించారు. ఈ సంధర్బంగా ఆమె మాట్లాడుతూ షాదిముభారక్ పథకం క్రింద లక్షరూపాయలు, వృద్దుల, వితంతువుల, వికలాంగుల పించనులను రెట్టింపు చేసి టిఆర్‌ఎస్ 2సారి అధికారంలో వచ్చినంక అందించడం చాలా గొప్పవిషయమం అని తెలిపారు.
రంజాన్ పండుగ సంధర్బంగా మైనారిటి కుటుంబాలలో ఉన్నవారందరికి రేషన్‌కార్డులలో పేరున్నవారందిరికి నూతన వస్త్రాలు అందించడం, మజిద్‌ల రిపేర్లకు నిధులు అందించడం, ఇమామ్‌లకు వేతనాలు అమలు చేయడం టిఆర్‌ఎస్ పార్టీ ఘనతే అన్నారు.
ప్రతిఒకరు కారుగుర్తుకు ఓటేసి అత్యదిక మెజారిటితో గెలిపించాలని విజ్ఞప్తి చేసారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, డివిజన్ ప్రజలు పాల్గొన్నారు.

0 Comments:
Post a Comment