ఎమ్మెల్యే బిగాల పాదయాత్రతో గులాబి మయంగా మారిన నిజామాబాద్ నగరం
నిజామాబాద్ (చట్టం న్యూస్) : ఈరోజు ఎమ్మెల్యే గణేష్ బిగాల నిజామాబాద్ నగరంలో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈరోజు నిర్వహించిన పాదయాత్ర ఘన విజయానికి సంకేతం అని తెలిపారు. 10,000 మంది పాల్గొని దిగ్విజయం చేశారు. ఊహించని విధంగా ప్రజలు అలసిపోకుండా చివరి వరకు ఈ యొక్క పాదయాత్ర లో పాల్గొనoదుకు పాదయాత్రను ఘనవిజయం చేసినందుకు ప్రతి ఒక్కరికి చెతులెత్తి కృతజ్ఞతలు తెలిపారు. పాదయాత్రతో నిజామాబాద్ చరిత్రలోనే నిలిచిపోతుంది అని తెలిపారు.
పాదయాత్ర నిజామాబాద్ నగరంలో గులాబీ మాయంగా మారింది అని పాదయాత్రని ఇంతటి ఘనవిజయంతో సాదించి ముందుకు తీసుకెళ్లిన మా ప్రతి కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. 20 వ తేదీన కలెక్టరేట్ చౌరస్తాలో నిర్వహించే టిఆర్‌ఎస్ పార్టీ మీటింగును ఇదేవిధంగా ఘనవిజయం చేయాలని కోరారు. టిఆర్‌ఎస్ పార్టీకి మద్దతు తెలుపుతున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.
మన అధికారంలో టిఆర్‌ఎస్ పార్టీ ఉంది తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నారు. అదేవిధంగా నిజామాబాద్ ఎమ్మెల్యేగా కూడా టిఆర్‌ఎస్ పార్టీ కాబట్టి 22 వ తేదీన జరగబోయే మున్సిపల్ ఎన్నికలలో మీ యొక్క డివిజన్ల లో టిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థికి మీ యొక్క అమూల్యమైన ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించినటైతే మన మున్సిపల్ లో కూడా టిఆర్‌ఎస్ అభ్యర్థి మేయర్ గా చేసుకుంటే నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో అభివృద్ధి మరింత వేగంగా చేయవచ్చు అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా ఇంచార్జి తుల ఉమ, నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, రెడ్ కో చైర్మన్ ఎస్ ఎ అలిమ్, తారిక్ అన్సారీ, మాజీ మేయర్ ఆకుల సుజాత, 60 డివిజన్ల కార్పొరేటరు అభ్యర్థులు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు


0 Comments:
Post a Comment