ఇదో నమ్మలేని నిజం.. ఆ భిక్షగాడు సామాన్యుడు కాదు..
ఇదో నమ్మలేని నిజం.. ఆ భిక్షగాడు సామాన్యుడు కాదు..
ఉన్నత కుటుంబం .. ఉన్నతచదువు..
ఉన్నత కుటుంబం .. ఉన్నతచదువు..
సుప్రసిద్ధ పూరీ జగన్నాధాలయం వద్ద ఓ యాచకుడికి...ఓ రిక్షా కార్మికుడికి మధ్య జరిగిన ఘర్షణలో అతడెవరో తెలిసి పోలీసులకు మతిపోయింది..అత్యున్నతస్థాయి అధికారి కుటుంబం నుంచి వచ్చి, ఇంజినీరింగ్ చదివి, మంచి ఉద్యోగం చేసి..చివరకు భిక్షాటన చేస్తున్న ఓ వ్యక్తి‘గతాన్ని’ కళ్లెదుట ఆవిష్కరించింది.ఘర్షణ తరువాత కాషాయ వస్త్రధారి అయిన యాచకుడు ఇంగ్లిష్ లో రాసిచ్చినఫిర్యాదును చూసి పోలీసు సిబ్బంది కళ్ళుతేలవేశారు. అసలు నువ్వుఎవరని నిలదీశారు.
చివరకు అతడిని ఒకప్పుడు మిల్టన్ కంపెనీలో ఇంజినీరుగా పనిచేసిన భువనేశ్వర్‌కు చెందిన గిరిజా శంకర్‌మిశ్రాగా గుర్తించారు. పోలీసు అధికారిగా పనిచేసిన ఆయన తండ్రి కొన్నేళ్ల క్రితం మరణించారు. అమ్మకూడా కాలం చేశారు. అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు ఉన్నతస్థానాల్లో ఉన్నారు. ఈ వివరాలన్నిటినీ యాచకుడిగా మారిన నాటి ఇంజినీరు నుంచి విన్న పోలీసులు ఆయన కుటుంబాన్ని వెతికే పనిలో పడ్డారు. ఆయన మాత్రం తాను మానసిక ఇబ్బందుల వల్లే ఇల్లూ, ఉద్యోగం వదిలేసి వెళ్లిపోయినట్లు చెప్పారు. దేశదిమ్మరిగా ఎటెటోవెళ్లిపోయానన్నాడు. ఆకలిని తీర్చుకోవడానికి యాత్రా స్థలాల్లో యాచన చేస్తున్నట్లు చెప్పారు. ఇటీవలే సొంతూరికి వచ్చాననీ, కుటుంబసభ్యులెవరినీ కలుసుకోవాలని లేదని కూడా తెలిపారు.

0 Comments:
Post a Comment