నెల జీతం లక్ష రూపాయలు (అలవెన్సులతో కలిపి) విరాళంగా ప్రకటించిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (DCCB) అధ్యక్షుడు శ్రీ పోచారం భాస్కర్ రెడ్డి గారు
కరోనా మహమ్మారి నివారణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు తనవంతు మద్దతుగా తన నెల జీతం లక్ష రూపాయలు (అలవెన్సులతో కలిపి) విరాళంగా ప్రకటించిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (DCCB) అధ్యక్షుడు శ్రీ పోచారం భాస్కర్ రెడ్డి గారు.
ఈరోజు విడుదల చేసిన ప్రకటనలో భాస్కర్ రెడ్డి గారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా తీసుకున్న చర్యలతో రాష్ట్రంలో కరోనా వైరస్ తక్కువగా ఉందన్నారు.
అదేవిధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ రైతాంగ శ్రేయస్సు కోసం ఈ యాసంగిలో పండిన ధాన్యం మెుత్తం కొనుగోలు కోసం రూ. 25,000 కోట్ల రూపాయలు కేటాయించడం గొప్ప విషయమన్నారు. దేశంలోని ఏ రాష్ట్రం కూడా ఇంత పెద్ద నిర్ణయాన్ని ఎన్నడూ తీసుకోలేదన్నారు.
రైతాంగ మేలు కోసం ఇంత గొప్ప నిర్ణయాన్ని తీసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారికి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రైతుల తరుపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని భాస్కర్ రెడ్డి గారు తెలిపారు.
కరోనా వైరస్ వ్యాప్తి అరికట్టడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు మనమందరం సహకారం అందించాలని భాస్కర్ రెడ్డి గారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వమే రైతుల వద్దకు వచ్చి ధాన్యం కాంటాలు ఏర్పాటు చేసి కొనుగోలు చేస్తుందని, కాంటాల సమయంలో రైతులు, హమాలీలు గుమికూడకుండా సామాజిక దూరం పాటించడం ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి అరికట్టవచ్చు. ఈ విషయాన్ని గమనించి రైతులందరూ సహకరించాలని భాస్కర్ రెడ్డి గారు విజ్ఞప్తి చేశారు.
0 Comments:
Post a Comment