అనవసరంగా బయట తిరగొద్దు..! అత్యవసరమైతేనే బయటకు రావాలి
కరోనా వైరస్ వ్యాప్తి నిర్మూలనకు ప్రభుత్వం లాక్‌డౌన్ అమలు చేస్తున్నందుకు ప్రజలెవ్వరూ బయటకు రావొద్దని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు పిలుపు నిచ్చారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలోని విక్టరీ టాకీసు సర్కిల్ నుంచి వారి నివాసం వరకూ పలు వీధుల్లో కలియ తిరుగుతూ.. లాక్‌డౌన్ తీరును సోమవారం ఉదయం పరిశీలించారు. అనవసరంగా బయట తిరుగుతూ కనిపించిన వాహనా దారులతో మాట్లాడి వారిని ఎక్కడికి వెళ్తున్నారని మంత్రి ప్రశ్నించి మందలించారు. వారు చెప్పే సమాధానం అసంబద్ధతతో ఉన్నదని మూడు వాహనాలను సీజ్ చేయించారు. కరోనా వైరస్ చాలా ప్రమాదకరమైందని.. అత్యవసరమైతే తప్ప ఎవ్వరూ బయటకు రావొద్దని కోరారు.
పోలీసు విధులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలు, యువత పట్టణ, గ్రామాల స్వీయరక్షణకు చర్యలు తీసుకోవాలని కోరారు. మంత్రి వెంట ఉన్న పోలీసు సిబ్బందితో రోడ్లపై వాహనాలతో తిరిగే వారిని గమనించి ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అవసరమైతేనే వచ్చే జనానికి సపోర్ట్ చేయాలని, అనవసరంగా రోడ్లపైకి వచ్చే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని వన్ టౌన్ సీఐ సైదులుకు మంత్రి సూచనలు చేశారు.


0 Comments:
Post a Comment