విధులకు గైర్హాజరైన ఫార్మాసిస్ట్ వినోద్ కుమార్ సస్పెన్షన్‌కు ఆదేశించిన జిల్లా కలెక్టర్ సిఎన్‌ఆర్
చంద్రశేఖర్ కాలనీలోని అర్బన్ పబ్లిక్ హెల్త్ లో పనిచేస్తున్న ఫార్మసిస్ట్ వినోద్ కుమార్ ను సస్పెండ్ చేయాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి వైద్య ఆరోగ్య శాఖ అధికారిని ఆదేశించారు.
సోమవారం నాడు ఆయన ఆకస్మికంగా ఆస్పత్రిని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హెల్త్ ఆఫీసర్ నాగేశ్వర్ రెడ్డి ఆలస్యంగా వచ్చినందుకు కారణాలు అడిగారు. హాజరు పట్టిక ప్రకారం ఫార్మాసిస్ట్ వినోద్ కుమార్ అనధికారికంగా గైర్హాజరు కావడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసి అతనిని సస్పెండ్ చేయాలని ఆదేశించారు. అకౌంటెంట్ వందన కూడా గైర్హాజరు కావడం పరిశీలించారు.
అయితే వందన మెడికల్ చెకప్ కు వెళ్లినందున ఆమెకు మెమో జారీ చేయాలని ఆదేశించారు. అదేవిధంగా ఉదయం 9 గంటలకు విధులకు రావలసిన డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి, అటెండర్ చాంద్ పాషా కలెక్టర్ వచ్చిన తర్వాత ఆలస్యంగా రావడంతో వారికి కూడా మెమోలు జారీ చేయవలసినదిగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని ఆదేశించారు.

0 Comments:
Post a Comment