పవన్ కళ్యాన్ ఇచ్చిన పిలుపునకు స్పందించిన సురేఖ
తులసి మొక్కకు పూజ చేశారు. ఆ ఫొటోను రామ్ చరణ్ తన ట్విటర్ అకౌంట్లో పోస్ట్ చేశారు.

అంతర్వేదిలో రథం దగ్ధం ఘటనకు సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపునకు మెగాస్టార్ చిరంజీవి భార్య కొణిదెల సురేఖ స్పందించారు.

అంతర్వేదిలో రథం దగ్ధం ఘటనపై స్పందించిన పవన్ కళ్యాణ్ దేవాలయాలపై జరుగుతున్న దాడులకు నిరసనగా సనాతన ధర్మాన్ని పరిరక్షించాలని కోరుతూ.. ఇవాళ సాయంత్రం అందరూ దీపాలు వెలిగించాలని పిలుపునిచ్చారు.

సాయంత్రం 05.30 నుంచి 06.30 గంటల మధ్య దీపారాధన చేసి #Bharathiya_culture_matters హ్యాష్‌టాగ్‌తో సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని కోరారు.

పవన్ కళ్యాన్ ఇచ్చిన పిలుపునకు స్పందించిన సురేఖ తులసి మొక్కకు పూజ చేశారు. ఆ ఫొటోను రామ్ చరణ్ తన ట్విటర్ అకౌంట్లో పోస్ట్ చేశారు.

పవన్ కళ్యాణ్ కూడా స్వయంగా పూజ చేశారు. ఆ ఫొటోలను కూడా సోషల్ మీడియాలో పంచుకున్నారు.

సనాతన ధర్మాన్ని పరిరక్షించాలని కోరుతూ పవన్ కళ్యాణ్ పూజ
0 Comments:
Post a Comment